టార్గెట్ పెట్టుకున్న సుకుమార్

24
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ‘పుష్ప‌ 2’. ఈ సినిమా ఆగ‌స్ట్ 15న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విష‌యంలో సుకుమార్ టార్గెట్ పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లో పుష్ప‌ 2 షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌ ను మే లోపు పూర్తి చేసి, త‌ర్వాతి మూడు నెల‌ల‌ను ప్ర‌మోష‌న్స్ కోసం కేటాయించాల‌ని ఫిక్స్ అయిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఎన్నో అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం దేవి శ్రీ ప్ర‌సాద్ ఓ అదిరిపోయే స్పెష‌ల్ సాంగ్‌ ను ట్యూన్ చేశాడ‌ట‌.

ఆ సాంగ్ కోసం టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ను లాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో నిజ‌మెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ వార్త నిజ‌మైతే మాత్రం సాంగ్ నెక్ట్స్ లెవెల్‌కి వెళ్ల‌డం ఖాయం. ఏది ఏమైనా ‘పుష్ప‌ 2’ స్పెష‌ల్ సాంగ్‌ లో క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తే ఆ రేంజే వేరు. ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌ గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పుష్ప 2 షూటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్‌ సీన్స్‌ కోసం ఇప్పటికే పీటర్‌ హెయిన్స్‌ భారీ సెట్స్ కూడా వేశారు. ఇక ప్ర‌స్తుతం పుష్ప‌2 చేస్తున్నఅల్లు అర్జున్, త‌న త‌ర్వాతి సినిమాల‌ను త్రివిక్ర‌మ్, సందీప్ రెడ్డితో ఇప్ప‌టికే అనౌన్స్ చేశాడు. కానీ, ఇప్పుడు బ‌న్నీ త‌న ప్రియారిటీని మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read:Jagan:జగన్ ‘ మేనిఫెస్టో’.. నవరత్నాలకు మించి?

- Advertisement -