రష్మికా లుక్ టెస్టు…సుక్కు హ్యాపీ!

424
sukumar
- Advertisement -

అల..వైకుంఠపురంలో తర్వాత అల్లు అర్జున్‌-సుకుమార్ దర్శక్త్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

బన్నీ సరసన రష్మికా మందన్న జోడిగా నటిస్తోండగా హీరోయిన్‌కు సంబంధించిన ఫోటో షూట్‌ నిర్వహించారు దర్శకులు సుకుమార్. చిత్తూరు లోకల్ అమ్మాయిగా రష్మికా కనిపించనుండగా ఆమె ఫోటో షూట్,లుక్ టెస్టుపై సంతృప్తి వ్యక్తం చేశారు సుక్కు. గతంలో రంగస్ధలం సినిమా సమయంలో సమంత పాత్ర లుక్ టెస్టు నిర్వహించిన సుకుమార్..సమంత పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తుండగా సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -