బన్నీకి పరామర్శల వెల్లువ

3
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఉదయం ఆయన జైలు నుంచి బయటకు రాగా పోలీసు ఎస్కార్ట్ వాహనం ద్వారా తన నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ ఉన్నారు. శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందడంతో అల్లు అర్జున్ విడుదల ప్రక్రియ వాయిదా పడింది. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యారు చిరంజీవి భార్య, మేనత్త సురేఖమ్మ. అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని బన్నీకి ధైర్యం చెప్పారు హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సుకుమార్, పుష్ప సినిమా నిర్మాతలు .

Also Read:రాజ్యసభకు మెగాస్టార్?

- Advertisement -