కన్ఫామ్‌..రాకింగ్ రాకేష్‌తో సుజాత వివాహం!

64
- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే తొలి జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల క్రితం తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇచ్చిన రాకేష్…తర్వాత పలు స్కిట్‌లు చేశారు. ఈ క్రమంలోనే సుజాతతో ప్రేమలో పడ్డారు.

తొలిసారి తన యూట్యూబ్ ఛానల్ లో రాకింగ్ రాకేష్ తో పెళ్లి గురించి అధికారికంగా బయట పెట్టింది జబర్దస్త్ సుజాత. రోజా హౌస్ టూర్ లో భాగంగా మాట్లాడుతూ.. తమ రిలేషన్ గురించి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. త్వరలోనే పెళ్లి గురించి మరిన్ని వివరాలు చెప్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది.
ఏదేమైనా జబర్దస్త్ షో నుంచి ఒక జంట పెళ్లి పీటలు ఎక్కనుండడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -