చెరుకురసం ఇలా సేవిస్తే ఎన్ని లాభాలో!

26
- Advertisement -

సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ శీతల పానీయాలు సేవించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే తీవ్రమైన ఎండతాపం నుంచి బయట పడేందుకు చల్లటి పానీయాలు సేవిస్తూ సేద తీరుతుంటారు. కొందరు రసాయనిక పానీయాలు సేవిస్తే మరికొందరు.. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం వంటివి సేవిస్తూ ఉంటారు. రసాయనిక పనియాల కంటే సహజసిద్దమైన పానీయాలు సేవించడమే ఎంతో మంచిది. అయితే పండ్ల రసాలు, కొబ్బరినీళ్ల కంటే చౌకగా లభిస్తు వేసవి తాపాన్ని తగ్గించే పనియాలలో చెరుకు రసం మొదటి ప్లేస్ లో ఉంటుంది. అందుకే బయటకు వెళితే రోడ్డు పక్కన కనిపించే చెరుకు బండి దగ్గరకు పరిగెత్తుకొని వెళుతుంటారు చాలమంది. చెరుకు రసం తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనిని తాగితే కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ బి12, బి6 వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి.

అయితే ఒట్టి చెరుకు రసం కాకుండా అందులో కొన్ని కొన్ని రకాల మిశ్రమాలు కలిపి సేవిస్తే శరీరానికి మరి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెరుకు రసంలో అల్లం రసం కలిపి సేవిస్తే జీర్ణక్రియ మెరుగు పడుతుందట. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతాయి. ఇంకా చెరుకు రసంలో తులసి ఆకులను కలిపి సేవిస్తే నోటి దుర్వాసన దూరమౌతుంది. అలాగే మలబద్దకం, ఎసిడిటీ వంటి సమస్యలు ఉండవు. ఇంకా ఇందులో తేనె కలిపి సేవించిన మంచిదేనని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. కాబట్టి వేసవిలో కేవలం చెరుకు రసం మాత్రమే కాకుండా దానితో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించే అల్లం, తులసి ఆకులు, సబ్జా గింజలు వంటివి కలిపి సేవించడం మంచిది. ఇక రోడ్డు పక్కన కనిపించే బండ్ల వద్ద చెరుకురసం తాగేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి, అక్కడ పరిశుభ్రత ఉందా ? లేదా అని చెక్ చేసుకొని, పరిశుభ్రంగా ఉన్నప్పుడే చెరుకు రసం సేవించడం మంచిది.

Also Read:గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి..న్యూ రిలీజ్ డేట్

- Advertisement -