గుడ్ న్యూస్….ఎవర్ గివెన్ నౌక కదిలింది

376
Ever Given container ship
- Advertisement -

గుడ్ న్యూస్..గత వారం రోజులుగా సుయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన ఎవర్ గివెన్ నౌక కదిలింది.ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జల మార్గం సూయజ్ కెనాల్‌లో భారీ నౌక కొద్దిగా కదిలినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మానవ నిర్మిత కాలువలో ఆరు రోజుల నుంచి చిక్కుకున్న ఎవర్ గివెన్ నౌక ప్రయాణం మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేమన్నారు. మెడిటెర్రేనియన్ సముద్రం, ఎర్ర సముద్రం మధ్య అనుసంధానం కోసం ఈ కాలువను నిర్మించారు.

త్వ‌ర‌లోనే సుయెజ్ కాలువను తిరిగి తెరిచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ షిప్ వ‌ల్ల ఇప్ప‌టికే కాలువ‌లో అటుఇటూ కొన్ని వంద‌లాది నౌక‌లు నిలిచిపోయాయి.షిప్ ట్రాకింగ్ స‌ర్వీస్ అయిన వెసెల్‌ఫైండ‌ర్ సుయెజ్ కాలువ‌లోని ఎవ‌ర్ గివెన్ షిప్ స్టేట‌స్‌ను మార్చింది. గ‌త మంగ‌ళ‌వారం 400 మీట‌ర్ల పొడువున్న ఈ షిప్ సుయెజ్ కాలువ‌లో అడ్డంగా ఇరుక్కుపోయిన విష‌యం తెలిసిందే. ఈదురు గాలుల కార‌ణంగా ఈ షిప్ అడ్డం తిరిగింది. ఇప్పటికే లక్షల కోట్లలో నష్టం వాటిల్లింది.

ఈజిప్టు సమీపంలో మద్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలిపే ఈ కాలువ.. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గాల్లో ఒకటి. కాగా, 193 కిలోమీటర్ల పొడవైన సూయజ్​ కాలువ ద్వారా మధ్యప్రాశ్చం నుంచి ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు ఆయిల్​ ట్యాంకర్ల రాకపోకలు సాగుతుంటాయి. ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం సరకు రవాణా ఈ కాలువ ద్వారానే జరుగుతుంది. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ దాదాపు 10 లక్షల బ్యారెల్స్​ చమురు సరఫరా అవుతోంది.

- Advertisement -