BB6…సుదీప ఎలిమినేట్

160
BB6
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 43 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 43వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు సుదీప. అనంతరం హౌస్ నుండి బయటకు వచ్చిన సుదీప… రేవంత్‌ను టార్గెట్ చేస్తూ గాలి తీసేసింది. తోపుడు బండిపై కూరగాయలు పెట్టి, వాటి లక్షణాన్ని తగ్గట్టు పేర్లు పెట్టి అవి ఎవరికి సూటవుతాయో చెప్పమని నాగ్ కోరగా రేవంత్‌ను మిరపకాయతో పోల్చింది. తాను కెప్టెన్ అయితే అందరినీ మార్చిపారదొబ్బుతా అని రేవంత్ అన్నారు కానీ అంటూ పంచ్ ఇచ్చి వెళ్లిపోయారు సుదీప. బిగ్ బాస్‌లోకి వచ్చే ముందు మా ఆయన రెండు వారాలే ఉంటావ్‌ అని అన్నారు కానీ ఆరు వారాలు ఉన్నానని తెలిపింది.

ఇక అంతకముందు సన్‌డే ఫన్‌డేలో భాగంగా గీతూను కాసేపు ఆడుకున్నారు. రేవంత్ స్టోర్ రూమ్‌కు వెళ్లు అని నాగార్జున చెప్పగానే.. గీతూ అందుకుని ‘సార్, రేవంత్‌కి కాలు బాగాలేదు, ఈసారి ఎవరినైనా పంపండి సార్’ అంది. ఎవరో ఎందుకు నువ్వే వెళ్లు అని చెప్పగా ఆమె వెళ్తుంటే వయసు అయిపోయిన చిరుత అంటూ బాలాదిత్య పంచ్ వేశారు.

ఇక నామినేషన్స్‌లో ఉన్న రాజ్, సుదీప, బాలాదిత్య, గీతూ, మరీనా, శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తికి బోర్డులు ఇచ్చారు. ఒక్కొక్కరు బోర్డును ఓపెన్ చేస్తే సేఫ్ అని వచ్చినవాళ్లు సేవ్ అయినట్టు. అలా ఒక్కొక్కరు సేవ్ కాగా చివరకు సుదీప ఎలిమినేట్ అయ్యారు. దీంతో బాలాదిత్య, మరీనా కంటతడి పెట్టారు.

- Advertisement -