బుల్లితెర మీద ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తచ్చుకున్నాడు కమెడీయన్ సుడిగాలి సుధీర్. నటుడిగా, యాంకర్, మెజిషియన్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాకు సాఫ్ట్ వేర్ సుధీర్ అనే టైటిల్ ను ఖారారు చేశారు. దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈసందర్భంగా నేడు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఈసినిమాకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో సుడిగాలి సుధీర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సరిగ్గా పది సంవత్సరాల క్రితం నేను ఫిలిం నగర్ వచ్చినపుడు బయటి నుంచి ఛాంబర్ బిల్డింగ్ ను చూసి మురిసిపోయాను…కానీ అదే ఈరోజు ఫిలిం ఛాంబర్ లో నిలబడి తన సినిమా గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం మార్చి 20వ తేది నా జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అన్నారు. ఎందుకంటే అదే రోజున హీరోగా తన ప్రయాణం మొదలైందని చెప్పాడు.
తాను హీరోగా నటిస్తున్న రెండు సినిమాలు సాఫ్ట్ వేర్ సుధీర్, 3మంకీస్ ఒకే రోజున ప్రారంభమయ్యాయని తెలిపాడు. కెరీర్‌లో మొదటి సినిమానే పెద్ద టెక్నీషియన్లతో చేస్తానని అసలు ఊహించలేదన్నాడు.ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు పులిచర్ల రాజశేఖర్ రెడ్డి, నిర్మాత శేఖర్ రాజులకు ధన్యవాదాలు తెలిపాడు. ధన్య బాలకృష్ణన్ లాంటి హీరోయిన్,గౌతం రాజు వంటి టెక్నీషియన్లతో పనిచేయడం తన అదృష్టం అని చెప్పాడు.