- Advertisement -
కామన్వెల్త్ క్రీడల్లో పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్ హెవీ పారా వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. మొదటి ప్రయత్నంలో 208కేజీలను ఎత్తిన సుధీర్… రెండో ప్రయత్నంలో212 కేజీలను విజయవంతంగా లిఫ్ట్ చేశారు. మూడో ప్రయత్నంలో 217 కేజీలను ప్రయత్నించినా సఫలం కాలేదు. అయితే మొత్తం 134.5 పాయింట్లు సాధించిన సధీర్ స్వర్ణ పతకం నెగ్గాడు. దీంతో భారత్ ఖాతాలో ఆరో బంగారు పతకం చేరింది. పారా వెయిట్ లిఫ్టింగ్‌లో మొదటి పతకం అందించిన సుధీర్ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
- Advertisement -