GIC:హరితసేనలో వ్యాపారవేత్త సుధీర్

5
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంలో తన పుట్టినరోజు సందర్బంగా బెంగుళూరు లో కుటుంబ సమేతంగా మొక్కలు నాటారు ప్రముఖ వ్యాపారవేత్త Y సుధీర్ కుమార్.

ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ హరితసేన లో భాగంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

అందరిని చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వేడుక ఏదైనా మొక్కలు నాటే కార్యక్రమం లో ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఏడు సంవత్సరాల నుండి నిరంతరం మొక్కలు నాటే కార్యక్రమం ఒక యజ్ఞం లా తీసుకొని గ్రీనరి పెంచే దిశగా పని చేస్తున్న మాజీ రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్  కి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:హరిహర వీరమల్లు..లిరికల్ అప్‌డేట్!

- Advertisement -