సుధీర్ బాబు పనికిరాడన్న స్టార్ డైరెక్టర్‌ !

292
sudheer-babu-rejected-outright-director
sudheer-babu-rejected-outright-director
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే గట్టి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండైనా ఉండాలి.. లేదా.. సినిమా బ్యాక్‌గ్రౌండైనా ఉండాలి. సుధీర్ బాబు మనకు సూపర్ స్టార్ క్రిష్ణ అల్లుడిగా,మహేష్ బాబు బావగా సుపరిచితుడే. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సుధీర్ బాబు సినిమాలకు పనికిరాడంటూ ఒక స్టార్ డైరక్టర్‌ ఖరాఖండిగా చెప్పేశాడంట. అస్సలు సుధీర్‌కు హీరో అవ్వాల్సిన లక్షణాలు అస్సలే లేవని, సినిమాలకు పనికిరానీ పీసంటూ చెప్పేశాడట. ఆ స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ. నవ్వు సినిమాలకు పనికిరావంటూ సుధీర్ బాబు మొహం మీదే చెప్పేశాడట కృష్ణవంశీ. ఆ డైరెక్టర్ మాటలకు చాలా బాధపడ్డాడట.. అవమానంగా భావించిన సుధీర్ బాబు పట్టువిడువకుండా.. సినిమా, సినిమాకు డిఫరెంట్ స్టోరీలతో, నటనతో  తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌లో హీరోగా చేసిందే ఐదు సినిమాలు. బాలీవుడ్‌లో బాఘీ సినిమాలో విలన్‌గా చేసి మంచి మార్కులే తెచ్చుకున్నాడు.

Krishna Vamsi-Image-Gallery_0

తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటిన యంగ్ హీరో సుధీర్ బాబు.. ఎస్.ఎం.ఎస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తరువాత ప్రేమకథ చిత్రం సినిమా సూపర్ హిట్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. సరికొత్త పాత్రలతో కెరీర్‌లో దూసుకుపోతున్న సుధీర్ బాబు బాలీవుడ్ లో కూడా ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. ఇటీవల శమంతకమణిలో నలుగురు హీరోల్లో ఒకరిగా కనిపించిన సుధీర్ బాబు.. మరో మల్టీ స్టారర్ సినిమా వీర భోగవసంత రాయలు లో నటిస్తున్నాడు.

Sudheer Babu eight-packs body photos

- Advertisement -