‘వి’లో రక్షకుడిగా సుధీర్ బాబు..!

401
sudeer babu
- Advertisement -

నాచురల్ స్టార్ నాని హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వి. నాని సరసన అదితిరావు హైదరి,నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా హీరో సుధీర్ బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

రాక్షసుడు ఎదిగిన నాడు ఒకడొస్తాడని.. వాడే ఇప్పుడొస్తున్నాడు … రక్షకుడు వస్తున్నాడు.. అంటూ సినిమాలోని సుధీర్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చేతిలో గన్‌తో గురివైపు తీక్షణంగా చూస్తున్న సుధీర్ బాబు లుక్ ఆకట్టుకుంటోంది.

బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా ఈ మూవీ నాని 25వ సినిమా కావడం విశేషం.సినిమాటోగ్రఫీ : పిజి విందా, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, ఫైట్స్ : రవి వర్మ.

- Advertisement -