సుధీర్ బాబుకు జోడిగా మెహ్రీన్..

269
Mehreen
- Advertisement -

స‌మ్మోహ‌నం సినిమాతో విజ‌యం అందుకున్న సుధీర్ బాబు కొత్త సినిమా ఆగ‌స్ట్ 17న రామానాయుడు స్టూడియోస్‌లో మొద‌లు కానుంది. పులి వాసు ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో సుధీర్ బాబుతో మెహ్రీన్ కౌర్ న‌టించ‌నుంది. తొలిసారి ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు.. స్టార్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్.. ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల కృష్ణ ఈ ఓపెనింగ్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.

Sudheer Babu

ఆగ‌స్ట్ 17 ఉద‌యం 9.30 నిమిషాల‌కు ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది. రిజ్వాన్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో రిజ్వాన్ ఈ చిత్రాన్ని ప్రొడ‌క్ష‌న్ నెం.2గా నిర్మిస్తున్నారు. న‌టీన‌టులు: సుధీర్ బాబు, మెహ్రీన్.. సాంకేతిక నిపుణులు: ద‌ర్శ‌కుడు: పులి వాసు, నిర్మాత‌: రిజ్వాన్, బ్యాన‌ర్: రిజ్వాన్ ఎంట‌ర్ టైన్మెంట్స్, స‌హ నిర్మాత‌: ఖుర్షీద్ (ఖుషీ).

- Advertisement -