సుధీర్ బాబు @ శ్రీదేవి సోడా సెంటర్

95
sridevi soda center
- Advertisement -

పలాస్ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్‌. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లాద్, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా సినిమా నుండి అప్‌డేట్‌ని ఇచ్చారు మేకర్స్‌. ఈ చిత్రంలో సుధీర్ సూరిగాడు అనే లైటింగ్‌ బాయ్‌గా కనిపించనున్నాడు. శ్రీదేవి ఇంట్రో టీజర్ జూలై 30న ఉదయం 10 గంటలకు రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో పావెల్ నవగీతన్, సత్యం రాజేష్, నరేష్, రఘుబాబు, అజయ్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వైవిధ్యమైన చిత్రం డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను జీ కొనుగోలు చేసింది. ఇందులో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్‌గా నటించగా మణి శర్మ సంగీతం అందించారు.

- Advertisement -