ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి

3
- Advertisement -

బోధన్ ఎమ్మెల్యే సుధర్షన్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది ప్రభుత్వం. ఫ్లాగ్‌షిప్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వ సలహాదారుగా సుధర్షన్ రెడ్డి నియమించారు.

కేబినెట్ మంత్రి హోదా ర్యాంకుతో నియమించింది ప్రభుత్వం. ఫ్లాగ్‌షిప్ పథకాల అమలును సమీక్షించనున్నారు సుదర్శన్ రెడ్డి. జిల్లా కలెక్టర్లు, శాఖ కార్యదర్శులతో సమన్వయం చేయనున్నారు.

అన్ని కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్ రెడ్డి హాజరుకానున్నారు. ముఖ్య సలహాదారుడికి సచివాలయంలో మంత్రి స్థాయి వసతులు కల్పించనుంది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -