గత రెండు రోజుల నుంచి గాయని సుచిత్ర ట్విట్టర్ ఎకౌంట్ నుంచి సెలబ్రెటీల ఫోటోలు లీకవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్లు, సింగర్‌లతో హీరో ధనుష్, సంగీత దర్శకుడు అనిరుధ్ సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత ఫొటోలు లీకయ్యాయి. దీంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.
తాజాగా సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ నుంచే మరో వీడియో బయటపడింది. ఆ వీడియోలో హీరో ధనుష్ తమన్నా, పూనమ్ భజ్వా(మొదటి సినిమా, బాస్ ఫేం)తో కలిసి మద్యం సేవిస్తూ పాటలు పాడుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియో కూడా సుచిత్ర కార్తిక్ అకౌంట్ నుంచే లీకవడం గమనార్హం. ఈ లీకులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని సుచిత్ర చెప్పుకుంటూ వస్తోంది. తన అకౌంట్‌ను అన్‌ఫాలో కావాలని కోరుతోంది.
మరోవైపు రానాతో కిస్ వివాదంపై నటి త్రిష స్పందించింది. ‘పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కూర్చుని విశ్రాంతిగా చూస్తూ ఉండండి. మిమ్మల్ని బాధపెట్టిన వారు.. వారంతట వారే నాశనం అయిపోతారు. మీకు అదృష్టం ఉంటే.. వాళ్ల నాశనాన్ని మీ కళ్లతో చూసే అవకాశం దేవుడు మీకు ఇస్తాడు’ అంటూ చాలా ఘాటుగా స్పందించింది.
https://youtu.be/_xLLZUeGRO4