ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేసేందుకు సెకెండ్ టైమ్ మెగాఫోన్ పట్టారు. “సుబ్రహ్మణ్య” టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ప్రతిష్టాత్మకంగా ఎస్జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2గా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ‘గుణ 369’ సక్సెస్ తర్వాత తర్వాత, సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ జానర్లో ప్రొడక్షన్ హౌస్‌కి తొలి చిత్రంగా నిలిచింది. శ్రీమతి ప్రవీణ కడియాల, శ్రీమతి రామలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ప్రొడక్షన్ హౌస్ సుబ్రహ్మణ్య ప్రీ-లుక్‌ను రివిల్ చేసింది. పోస్టర్ సినిమా కోసం క్రియేట్ చేసిన ఫాంటసీ వరల్డ్ లోకి స్నీక్ పీక్‌ను అందిస్తుంది. మూవీ ఆర్ట్‌వర్క్ గ్రాండియర్ గా వుంది. ఈ స్పెల్‌బైండింగ్ ప్రీ లుక్ సినిమాపై ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసింది. ప్రీమియం లార్జ్ ఫార్మాట్, IMAX థియేటర్లలోని ప్రేక్షకులకు అడ్వంచర్ థ్రిల్‌ను అందించడానికి ఈ చిత్రాన్ని బిగ్ ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నారు. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ విజువల్, ఎమోషనల్ ట్రీట్‌గా అద్భుతమైన కథతో సెట్ చేయబడింది.
ఈ చిత్రం ఇప్పటికే 60% నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముంబయిలోని ప్రముఖ రెడ్ చిల్లీస్ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నాయి. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ప్రముఖ స్టూడియోలలో VFX & CGI పనులు జరుగుతున్నాయి.
సుబ్రహ్మణ్య సినిమా టెక్నికల్‌గా ఉన్నతంగా ఉండబోతుంది, దీనికి టాప్ నాచ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. కెజిఎఫ్, సాలర్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, విఘ్నేష్ రాజ్ సినిమాటోగ్రాఫర్. విజయ్ ఎం కుమార్ ఎడిటర్. సప్త సాగరదాచే & చార్లీ 777 ఫేమ్ ఉల్లాస్ హైదూర్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. పాన్ ఇండియా మూవీ సుబ్రహ్మణ్య తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Also Read:మనసు ఇచ్చిన పిల్లా.. మాట తప్పితే ఎల్లా