సిట్‌ ముందుకు సుబ్బరాజు

197
subbaraju to appear before sit
subbaraju to appear before sit
- Advertisement -

టాలీవుడ్‌లో పెను కలకలం రేపిన డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖుల పేర్లు భయటకు రావడంతో వారంతా వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వాడలేదని.. చాలా కష్టాలు పడి నిలదొక్కుకున్నానని, తమ గురించి మీడియాకు ఏమీ తెలియకుండా రాసేస్తోందని నానా యాగి చేశారు.. పనిలో పనిగా మీడియాను ఆడిపోసుకున్నారు. అనంతరం సిట్ ముందు విచారణకు హాజరైన సందర్భంగా సుమారుగా అందరూ….తమకు కెల్విన్ ఎవరో తెలియదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులు కెల్విన్ తో సినీ ప్రముఖులు దిగిన ఫోటోలను వారి ముందు పెట్టి…ఇవి ఎవరివి? అని ప్రశ్నించడంతో సినీ ప్రముఖుల నోళ్లు మూతపడ్డాయని తెలుస్తోంది.

కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న సమయంలో కెల్విన్ డ్రగ్స్ ఇచ్చిన తరువాత సినీ తారలతో సెల్ఫీలు దిగేవాడు. ఆ సెల్ఫీలపై తేదీ సమయం కూడా నమోదవడంతో ప్రముఖులు అడ్డంగా బుక్కయ్యారు.  అంతే కాకుండా కెల్విన్ ను విచారించిన పోలీసులు మరింత విలువైన సమాచారం సంపాదించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు మీడియాను బుకాయించగలిగినా… పోలీసుల మందు మాత్రం నీళ్లు నములుతున్నారు.

ఇక మొన్న పూరీ జగన్నాథ్, నిన్న శ్యామ్ కే నాయుడును విచారించిన పోలీసులు, నేడు పూరీ బ్యాచ్ లోని సుబ్బరాజును విచారించనున్నారు. విలన్ గా సినీ రంగప్రవేశం చేసిన సుబ్బరాజు వివిధ రకమైన పాత్రలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే కెల్విన్ డ్రగ్ దందాలో సంబంధాలు ఉన్నాయన్న వార్తలు రాగానే తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, తాను డ్రగ్స్ తీసుకోనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 10 గంటలకు తన లాయర్ తో కలిసి సుబ్బరాజు సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు.

- Advertisement -