టాలీవుడ్ నెం1 హీరో అల్లు అర్జున్

419
allu arjun
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల..వైకుంఠపురం సినిమాతో టాలీవుడ్ లో నెం.1 స్ధానాన్ని దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ఈ మూవీ బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. తాజాగా ప్రైవేటు సంస్ధ చేసిన సర్వేలో అల్లు అర్జున్ మొదటి స్ధానంలో నిలిచారు. ఆ త‌ర్వాతి స్థానాల‌లో మ‌హేష్ , ప్రభాస్ ఉన్నారు. ఇక రంగ‌స్థ‌లం వంటి భారీ హిట్ కొట్టిన చ‌ర‌ణ్ ..నానీ,విజయ్ దేవరకొండ ఉన్నారు.

ఇక చిరంజీవి 6 స్ధానాన్ని దక్కించుకోగా, రామ్ చరణ్ 9వ ప్లేస్ లో ఉన్నారు. మరోవైపు తమిళ్ లో విజయ్ దళపతి నెం1 స్ధానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాత అజిత్‌, సూర్య‌, ర‌జ‌నీకాంత్‌, విజ‌య్ సేతుప‌తి, ధ‌నుష్, క‌మ‌ల్ హాస‌న్, శివ‌కార్తికేయ‌న్‌, విక్ర‌మ్, జ‌యం ర‌వి ఉన్నారు . విజయ్ నటించిన మాస్టర్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీ విడుదల తర్వాత ఆయనకు మరింత క్రేజ్ పెరగనుంది. కాగా రజీనికాంత్ నటించిన సినిమాలు విజయం సాధించిన ఆయన 4వ స్ధానంలో ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

- Advertisement -