బాలీవుడ్ లోకి అల్లు అర్జున్…

472
Allu Arjun Bollywood Director Nikhil
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు అల.. వైకుంఠపురంలో అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈటైటిల్ కు సంబంధించిన టీజర్ ను కూడా ఆగస్ట్ 15 న విడుదల చేశారు చిత్రయూనిట్. పూజా హెగ్డె హీరోయిన్ గా నటించగా..నవదీప్, అక్కినేసి సుమంత్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ టబు కూడా ఈమూవీలో నటిస్తుంది. గీతా ఆర్ట్స్ అండ్ హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను 2020సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈసినిమా తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు వేణు శ్రీరామ్ తో సినిమా చేయనున్నాడు.

ala-vaikunthapuramlo-

జనవరిలో ఈసినిమా షూటింగ్ ప్రారంభం కానుంది ప్రస్తుతం ఈమూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈసినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. ఈమూవీతో పాటు బన్నీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సుకుమార్ తో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఈరెండు సినిమాలు ఒకే సారి చేస్తాడా లేదా ఒక దాని తర్వాత మరోకటి చేస్తారా తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా కావడం విశేషం. ఇక ఈసినిమా తర్వాత అల్లు అర్జున్ బాలీవుడ్ లో సినిమా చేయనున్నాడని ఫిలిం నగర్ వర్గాల్లో కోడై కూస్తోంది. ఇటివలే ముంబైలో జరిగిన ఓ పార్టీలో బన్నీ బాలీవుడ్ దర్శకుడితో చర్చలు జరిపారని సమాచారం.

దర్శకుడు నిఖిల్ తో కలిసి బన్నీ పార్టీలో పాల్గొనడంతో అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బన్నీ బాలీవుడ్ సినిమా గురించి. బన్నీ బాలీవుడ్లో సినిమా చేయబోతున్నారని, దానికోసమే అల్లు అర్జున్.. నిఖిల్ అద్వానీలు కలిసారని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లడం మన హీరోలకు ఇదేం కొత్తకాదు. గతంలో రామ్ చరణ్ జంజీర్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈసినిమా అక్కడ అట్టర్ ప్లాప్ అయ్యింది. అంతకు ముందు చిరంజీవి మూడు, వెంకటేష్, నాగార్జునలు రెండు సినిమాలు చేశారు. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి సినిమాతో బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇదే బాటలో అల్లు అర్జున్ కూడా పయనిస్తాడా చూడాలి.

- Advertisement -