సస్పెన్స్ థ్రిల్లర్‌గా “స్టూవర్టుపురం”…

390
Stuvartupuram Movie
- Advertisement -

అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో గూఢచారి ఫేమ్ ప్రీతి సింగ్ ప్రధానపాత్రలో సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “స్టూవర్టుపురం”. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకొంటుంది.

సమర్పకుడు రంజిత్ కోడిప్యాక మాట్లాడుతూ … గతంలో మా బ్యానర్‌లో నిర్మించిన నందికొండ వాగుల్లోనా, మోని చిత్రాల దర్శకుడు సత్యనారాయణ ఏకారి అద్భుతంగా తెరకేకించాడు, ప్రస్తుతం రిరికార్డింగ్ జరుపుకుంటున్నది, మే నెలలో విడుదల చేయటానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నామన్నారు.

దర్శకుడు సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ … నర రూప రాక్షసులాంటి స్టూవర్టుపురం గ్యాంగ్ హీరోయిన్ ఇంట్లోకి చొరబడతారు , అప్పుడు హీరోయిన్ వాళ్ళను ఎలా డీల్ చేసిందన్న పాయింట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దాం, రిరికార్డింగ్ కు మంచి స్కోప్ ఉన్న ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నవనీత్ చారి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అందిస్తున్నారు, ఈ చిత్రం మా బ్యానర్‌లో మూడోవ చిత్రంగా మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుంది అన్నారు.

మల్లికా ,రవిరాజ్,భాను ప్రసాద్ ,హర్ష నల్లబెల్లి ,శివప్రసాద్ ,సాయిరామ్ దాసరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : వెమేష్ పెట్ల , కెమెరా , ఎడిట్టింగ్ : లక్కీ ఏకరీ , సంగీతం : నవనీత్ చారి , కో డైరెక్టర్ : టైగర్ రాంబాబు , సమర్పణ : రంజిత్ కోడిప్యాక ,కథ స్క్రీన్ ప్లే , నిర్మాత , దర్శకత్వం : సత్యనారాయణ ఏకారి.

- Advertisement -