GIC:హరితసేనలో స్కూల్ విద్యార్థులు

6
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంగా హరితసేనచేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జ్ పూలపల్లి పృద్వి రాజ్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్ పిల్లలతో కలిసి SI శిరీష , పార్టీ సీనియర్ నాయకులు ఆంజినేయులు , రాష్ట్ర హరితసేన కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్, నూతికాడి భోజ నారాయణ 20 మొక్కలు నాటడం జరిగింది.

Si శిరీష , హరితసేన రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్ మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ గారు చేపట్టిన బృహత్తర కార్యక్రమం లో పిల్లలను భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయం అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని వాటిని సంరక్షించాలని పిల్లలను కోరారు. ప్రతీ ఇంట్లో ఏ కార్యక్రమం ఏదైనా మొక్కలు నాటే సంస్కృతి పెంచుకోవాలని అన్నారు. రేపటి తరాలకు మనం ఇచ్చే ఆస్థి ఏదైనా ఉంది అంటే కేవలం మంచి చదువు, మంచి వాతావరణం అన్నారు.

ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి మీద ఉంది అన్నారు. మోడల్ స్కూల్ పరిధిలో మొక్కలు సంరక్షణ కొరకు జూనియర్ కాలేజ్ పిల్లను నియమించడం జరిగింది. ఇంతటి గొప్ప కార్యక్రమం లో అవకాశం కల్పించిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపాల్ చిన్నప్ప రెడ్డి గారు, BRS పార్టీ మండల అధ్యక్షులు ప్రభాకర్, ఉపసర్పంచ్ భాస్కర్, నరేందర్, శ్రీధర్ రెడ్డి, దండు సతీష్, అభిషేక్, ప్రవీణ్, అసిఫ్, సలీఫ్ ఆలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:నైపుణ్యం ఉంటేనే సక్సెస్!

- Advertisement -