ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలి: విద్యార్ధి జేఏసీ

464
mp aravind
- Advertisement -

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్ధి జేఏసీ డిమాండ్ చేసింది. నిజామాబాద్‌లో అరవింద్ ఫోటోకి కొమ్ములు పెట్టి విద్యార్థి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన విద్యార్ధి జేఏసీ నాయకులు అరవింద్ ద్వంద వైఖరిని తప్పుబట్టారు.

ఎన్నికల సందర్భంగా పసుపు రైతులకు మాట ఇచ్చిన అరవింద్ మోసం చేశారని జేఏసీ నాయకులు మండిపడ్డారు. అంబాసిడర్,టయోట కార్ల పేర్లతో రైతులను కించపరచడం సరికాదని….ఎన్నికల్లో గుర్తుకు రాని కార్లు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చాయని ప్రశ్నించారు.

బాండు పేపర్ మీద పసుపు బోర్డు 5 రోజుల్లో తెస్తామని చెప్పిన అరవింద్ ఇప్పుడు ఎందుకు మొఖం చాటేస్తున్నారని దుయ్యబట్టారు. డిసెంబర్ 31 వరకు పసుపు బోర్డు తేక పోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అని తెలిపారు.

Turmeric growers in Nizamabad district turned the heat on BJP MP … mandal, under the aegis of Turmeric Farmers Joint Action Committee (JAC).

- Advertisement -