టెస్టు క్రికెట్‌కు బ్రాడ్ గుడ్ బై..

43
- Advertisement -

ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఆసీస్‌తో జరిగిన 5వ టెస్టులో చివరి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్న స్టువర్ట్..జట్టును గెలిపించి క్రికెట్‌కు ఘనంగా వీడ్కోలు చెప్పాడు అలెక్స్ క్యారీని ఔట్ చేసి.. కెరీర్ చివ‌రి బంతికి వికెట్ తీసిన ఘ‌న‌త‌ను ద‌క్కించుకున్నాడ‌త‌ను. దీంతో ఈ మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది.

తన కెరీన్‌లో 167 టెస్టులు ఆడిన బ్రాడ్ 604 వికెట్లు తీయగా 121 వన్డేల్లో 178 వికెట్లు తీశాడు. 56 టీ20లు ఆడిన బ్రాడ్ 64 వికెట్లు తీశాడు. ఇక బ్రాడ్ కెరీర్లో చీకటి రోజు అంటే 2007 వరల్డ్ కప్‌. భారత్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో యువీ…బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్‌లు బాదాడు. ఇది బ్రాడ్ కెరీర్‌లో మర్చిపోలేని ఛేదు ఘటన.

Also Read:వర్షపు నీటిలో తడవడం మంచిదేనా..?

- Advertisement -