ఒత్తిడికి లోనవుతున్నారా..అయితే జాగ్రత్త!

21
- Advertisement -

నేటి రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న మానసిక రుగ్మతల్లో ఒత్తిడి అత్యంత ముఖ్యమైనది. దీని కారణంగా ఎంతో మంది డిప్రెషన్ కు లోనై చేజేతులా ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు అందరూ కూడా ఏదో సమయంలో ఒత్తిడికి లోనవుతుంటారు. పిల్లలు పరీక్ష సమయాల్లోనూ, పెద్దలు పనిభారం పెరిగినప్పుడు, వృద్ధులు ఆరోగ్యం సహకరించనప్పుడు.. ఇలా ప్రతిఒక్కరు ఆయా సందర్భాల్లో ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు. ఇలా తరచూ ఒత్తిడికి గురికావడం వల్ల గుండె దడ, ఆందోళన పెరుగుతుంది. తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అధికంగా ఒత్తిడికి లోనయ్యే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇంకా హైబీపీ, లోబీపీ వంటి సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయట. వీటితో పాటు ఆలోచన మందగించడం, ప్రతి చిన్న విషయానికి భయపడడం వంటి సమస్యలు రావోచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా ఒత్తిడి కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. మొఖంపై ముడతలు, మొటిమలు, జుట్టు రాలడం, వృద్ధాప్య ఛాయలు రావడం మొదలవుతుంది. ఇంకా అధికంగా ఒత్తిడికి లోనయ్యే వారిలో హార్మోన్ల అసమతుల్యత కూడా సంభావిస్తుందట. ఇవే కాకుండా ఆకలి మందగించడం, తరచూ అనారోగ్యం బారిన పడడం ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి.

కాబట్టి ఒత్తిడిని తేలికగా అసలు తీసుకోకూడని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒత్తిడిని అధిగమించడానికి కొన్ని జాగ్రత్తలు, సూచనలు తప్పనిసరిగా పాటించడం మంచిదట. ప్రతిరోజూ ఉదయం పూట ద్యానం, వ్యాయామం తప్పకుండా చేయాలి. ఎక్కువ సమయం స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడం అలవాటు చేసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. తినే ఆహారం విషయంలో తృణధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు వంటివి చేర్చుకుంటూ మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్ర పోవాలి. అన్నిటికీ మించి చిన్న చిన్న వాటికి ఎక్కువ రియాక్ట్ అవకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు.

Also Read: కాల్షియం తగ్గిందా.. అయితే!

- Advertisement -