ఒత్తిడి ఎక్కువైతే.. అల్జీమర్ వ్యాధి వస్తుందా?

31
- Advertisement -

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పని భారం కారణంగా చాలమంది తీవ్ర ఒత్తిడికి లోనౌతూ ఉంటారు. ఇంట్లో సమస్యల కారణంగానో లేదా పని భారం కారణంగానో లేదా ఇతరత్రా సమస్యల కారణంగానో ఒత్తిడికి గురి కావడం మరియు చిన్న విషయాలకే ఆందోళన పడిపోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఒత్తిడి, ఆందోళన వంటివి ఎక్కువైతే మానసిక రుగ్మతలుగా మారే ప్రమాదం ఉంది. అయితే ఒత్తిడి కారణంగా అల్జీమర్ వ్యాధి ( మతిమరుపు ) బారిన పడే అవకాశం కూడా ఉందట. సాధారణంగా అల్జీమర్ వ్యాధి 50 నుంచి 60 ఏళ్ళు పైబడిన వారిలో కనిపిస్తూ ఉంటుంది. వయసు ప్రభావం కారణంగా మెదడు పని తీరు మందగించి అల్జీమర్ వ్యాధికి దారి తీస్తుంది..

వస్తువులను మరచి పోవడం, ప్రతిరోజూ గుర్తించుకోవలసిన పనులను కూడా మర్చిఓవడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు తడబడడం, ప్రవర్తనలో మార్పు రావడం ఇవన్నీ అల్జీమర్ వ్యాధికి లక్షణలే. అయితే సాధారణంగా వృద్దాప్యంలో కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తోంది. దీనికి కారణం తీవ్రమైన ఒత్తిడి మానసిక రుగ్మతలే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ అల్జీమర్ వ్యాధికి సరైన వైద్యం లేని కారణంగా నివారణ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నా మాట.

Also Read:IND VS AUS:తొలి మ్యాచ్‌ లో సత్తా చాటేదేవరు?

చిన్న చిన్న విషయాలను అతిగా ఆలోచించడం మానేయాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. వీలైనంతా వరకు నలుగురితో ఉండేందుకు ఎక్కువ సమయం గడిపితే ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు దురమౌతాయట. ఇంకా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం, ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినడం వంటివి కూడా ఒత్తిడిని దూరం చేస్తాయట. కాబట్టి మానసిక రుగ్మతలు క్రమేసి పెరిగే పెద్ద సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఒత్తిడికి లోనవ్వకుండా మన ఆలోచనలను దృష్టి మరల్చుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:మొబైల్ డేటాను సేవ్ చేసే సూపర్ టిప్స్!

- Advertisement -