అధికారుల నిర్లక్ష్యం..బాలుడిపై వీధి కుక్కల దాడి

4
- Advertisement -

అధికారుల నిర్లక్ష్యం.. నాలుగు సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కల దాడి చేసిన ఘటన హైదరాబాద్ ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ సమీపంలో చోటు చేసుకుంది. మూడు నెలల నుంచి అధికారులకు కుక్కలపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు.

హైదరాబాద్ నగర శివారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ 20వ వార్డ్ బాలాజీ ఫంక్షన్ హాల్ సమీపంలోని బాలాజీ ఎంక్లేవ్ అపార్ట్మెంట్ వద్ద నాలుగు సంవత్సరాల భార్గవ్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి.

కుక్కల దాడిలో గాయపడ్డ భార్గవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు సమయానికి స్పందించక పోవడంతోనే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు.

Also Read:న్యూస్ అప్‌డేట్స్ టుడే..

- Advertisement -