ఓ మహిళ మద్యం సేవించి రోడ్డుపై రెచ్చిపోయింది. తమ స్కూటీని ఆపిన ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కింది. స్కూటీ మీద వెనుక కూర్చున్న మహిళ.. తమను వెళ్లనివ్వాలని గట్టిగా కేకలు వేస్తూ.. ట్రాఫిక్ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించారు. స్కూటీ తాళం చెవిని తీసుకున్న ట్రాఫిక్ పోలీసును కొట్టి.. అతని నుంచి తాళం చెవిని లాక్కున్నారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలోని మాయాపూరిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.
ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.. అనిల్ పాండే, మాధురి దంపతులు కలిసి యాక్టివాపై వెళ్తుండగా..హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వారి బైక్‌ను ఆపారు. దీంతో మాధురి ఓ ట్రాఫిక్ పోలీసుతో దుర్భషలాడుతూ.. అతనిపై దాడి చేసింది. ఈ క్రమంలో అనిల్ పాండే కల్పించుకొని.. తామిద్దరం పార్టీలో ఉండగా.. మాధురి సోదరుడు చనిపోయాడని ఫోన్ వచ్చింది. అందుకే తాము త్వరగా వెళ్లాలి.. వదిలిపెట్టండి అని పోలీసులను కోరాడు.
పోలీసులేమో బైక్‌ను రోడ్డు పక్కకు పార్క్ చేయాలని అనిల్‌ను ఆదేశించారు. ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించిన ఇతరులపై కూడా మాధురి దాడి చేసింది. మొత్తానికి వీరిద్దరూ మద్యం సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో మంగళవారం రాత్రి వారిని పోలీసులు అరెస్టు చేశారు.
#WATCH A woman and a man misbehaved&manhandled a traffic police cop on being stopped for not wearing helmet, in Delhi's Mayapuri, last evening.According to the police, the two were heavily drunk. Case has been registered against them on complaint of the traffic police personnel. pic.twitter.com/JSuQfFuDc4
— ANI (@ANI) July 17, 2019