కడుపులో పురుగులా..ఇలా చేయండి!

19
- Advertisement -

చాలామందికి కడుపులో నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. మలవిసర్జన చేసినప్పుడు ఈ పురుగులు బయట పడతాయి. ముఖ్యంగా ఈ నులిపురుగుల సమస్య చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. కొంతమంది పెద్దలు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటారు. కడుపులో ఈ నులిపురుగుల వ్యాప్తికి చాలానే కారణాలు ఉన్నాయి. అపరిశుబ్రమైన ఆహారాన్ని తినడం, కలుషితమైన నీరు త్రాగడం, పచ్చి మాంసం తినడం వంటి కారణాల వల్ల ఈ కడుపులో నులిపురుగులు ఏర్పడతాయి. పిల్లలు మట్టిలో ఎక్కువగా ఆటలు ఆడి చేతులను శుభ్రం చేసుకోకుండా ఆహారం తినడం వల్ల కూడా నులిపురుగుల వ్యాప్తి జరుగుతుంది. .

ఈ సమస్య కారణంగా పిల్లలు వేగంగా బలహీన పడడం, రక్తహీనత, కడుపులో నొప్పి, వాంతులు, వికారం, కడుపు ఉబ్బరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ నులిపురుగులను సాధారణ సమస్యగా భావిస్తే ప్రమాదామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేయడం వల్ల కడుపులో వీటి వృద్ధి క్రమంగా పెరిగి ప్రేగు క్యాన్సర్ కు కూడా దారి తీస్తుంది. కాబట్టి ఈ నులిపురుగుల సమస్య కొద్దిగా ఉన్నప్పుడే గుర్తించి వైద్యుడి సలహా మేరకు మెడిసిన్ తప్పకుండా వాడాల్సి ఉంటుంది. అయితే నులిపురుగుల సమస్య కొద్దిగా ఉన్నప్పుడు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా వాటిని నివారించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని పరగడుపున తాగడం ద్వారా నులిపురుగుల సమస్య తగ్గుతుంది. ఇక గుమ్మడి కాయ విత్తనాలు కూడా నులిపురుగుల నివారణకు ఎంతగానో తోడ్పడతాయి. ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి విత్తనాలను వేయించి వీటిని పొడిగా చేసుకుని కొబ్బరి పాలలో కలిపి తాగితే నులిపురుగుల సమస్యకు చెక్ పెడుతుంది. ఇంకా వెల్లుల్లి రెబ్బలను పరగడుపున తినడం ద్వారా కూడా ఈ తగ్గుతుంది. ఈ చిట్కాలు పాటిస్తూనే పీచు పదార్థం ఎక్కువగా ఉన్న కూరగాయలు అనగా క్యాబేజీ, క్యారెట్, ముల్లంగి, బీట్ రూట్ వంటివి ఎక్కువగా తినడం వల్ల కూడా నులిపురుగుల సమస్య నుంచి బయటపడవచ్చు.

Also Read:‘తిరగబడరసామీ’..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -