- Advertisement -
వన్డేలకు గుడ్ బై చెప్పారు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో భారత్‌తో ఓటమి తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించాడు. స్టీవ్ స్మిత్ తన కెరీర్‌లో 170 వన్డేలు ఆడగా వాటిల్లో 5800 రన్స్ చేశాడు. దీంట్లో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తన వన్డే జర్నీ అద్భుతంగా సాగిందని, ప్రతి క్షణాన్ని ప్రేమించినట్లు స్మిత్ తెలిపాడు. తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో అద్భుత క్షణాలు ఉన్నాయని, మధుర స్మృతులు, జ్ఞాపకాలు ఉన్నాయని, రెండు ప్రపంచ కప్‌లు గెలవడం సంతోషంగా ఉందని చెప్పారు.
టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నానని, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నానని, వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ పాల్గొనున్నట్లు చెప్పాడు.
Also Read:న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం
- Advertisement -

