ఇటీవల ముంబైలో సుమారు 70 వేల రూపాయల విలువైన 300 కిలోల టొమాటోలను దొంగిలించుకుపోయారట. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తమ బుట్టల్లోని టొమాటోలను వారి బారి నుంచి కాపాడుకునేందుకు వ్యాపారులు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకున్నారన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ఏకంగా ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ టొమాటో’ పేరిట ఓ సంస్థను ఏర్పాటుచేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. బుధవారమే ఈ టోమాటో బ్యాంక్‌ను తెరవగా.. విషయం తెలిసి కస్టమర్లు బ్యాంకుకు బారులుతీరారు. సాధారణ బ్యాంకుల్లో లోనుగా నగదు ఇస్తే ఈ బ్యాంక్‌లో టొమాటోలను రుణాలుగా ఇస్తున్నారు. విషయం తెలిసి కస్టమర్లు బ్యాంకుకు బారులుతీరారు. ఇందులో తమ వద్ద ఉన్న టొమాటోలు డిపాజిట్ చేస్తే ఆరు నెలల తర్వాత రెట్టింపు మొత్తంలో టొమాటోలు వస్తాయని ఈ సందర్భంగా కస్టమర్లు చెబుతున్నారు. 103 ఏళ్ల ఓ వృద్ధుడు కూడా ఈ బ్యాంకులో టోమాటోలు డిపాజిట్ చేశాడట. తాను అరకేజీ టొమాటో డిపాజిట్ చేశానని.. ఆరు నెలల తర్వాత కేజీ టొమాటోలు పొందుతానని మీడియాకు చెప్పాడు.
I have deposited 0.5 Kg tomatoes, will get 1 kg after 6 months. I'm 103-year-old, never thought have to see this: Srikrishna Verma, customer pic.twitter.com/PlXdnSYGvK
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 2, 2017
మరోవైపు టొమాటో ధర అందర్నీ వణికిస్తోంది. దీని ఉత్పత్తి బాగా తగ్గిపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోందని అంటున్నారు. వచ్చే ఆగస్టు మాసాంతం వరకో లేదా సెప్టెంబరు వరకో దీని ధర ఇలాగే కంటిన్యూ కావచ్చునని భావిస్తున్నారు.