- Advertisement -
‘ఇంద్ర’ సినిమాకి కథను అందించిన సినీ రచయిత చిన్నికృష్ణ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. గతంలో తాను కొందరి ఒత్తిడి కారణంగా ఆయనపై దుర్భాషలాడినందుకు ఎంతో బాధగా ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిందని తెలిసి ఎంతో ఆనందించానని అన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ ఇంటికెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. ఇక సినీ పరిశ్రమలో ఎవరికైనా ఆపద అంటూ వస్తే నేనున్నానంటూ అభయమిచ్చే మెగాస్టార్ చిరంజీవి.. గతంలో తన పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కూడా పెద్ద మనసుతో క్షమిస్తారు.
తాజాగా మరోసారి చిరు తన మంచి మనసు చాటుకున్నారు. ప్రముఖ రచయిత చిన్నికృష్ణను మళ్ళీ అక్కున చేర్చుకున్నారు. చిన్నికృష్ణ చాలా కాలంగా సినిమాలకు దూరమయ్యారు. ఆ మధ్య తాను సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి ‘కింగి ఫిషర్’ అనే సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక కొత్త భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చిన్నికృష్ణ ఒకప్పుడు తెలుగులో స్టార్ రైటర్. ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’, ‘గంగోత్రి’ లాంటి సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించారు చిన్నికృష్ణ.
అయితే, ‘బద్రీనాథ్’ సినిమాతో చిన్నికృష్ణ కెరీర్‌కు బ్రేకులు పడ్డాయి. ఆ తరవాత ‘జీనియస్’ అనే సినిమాకు సహ రచయితగా చిన్నికృష్ణ పనిచేశారు. ఇక అప్పటి నుంచీ మరో సినిమాకు పని చేయలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. గతంలో చిన్నికృష్ణ – మెగాస్టార్ మధ్య చిన్న గ్యాప్ వచ్చినా.. మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనసుతో చిన్నకృష్ణను మళ్ళీ దగ్గరకు తీసుకుని ఆయనతో కలిసి పని చేయబోతున్నారు.
Also Read:‘బెండకాయ’ తింటే ఇన్ని ఉపయోగలా!
- Advertisement -