- Advertisement -
ఈ నెల 30న అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానుంది. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం( జనవరి-30) తెలంగాణ వ్యాప్తంగా 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
రేపు (మంగళవారం) ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మౌనం పాటించాలని స్పష్టం చేసింది. ఆ సమయంలో రహదార్లపై వాహన రాకపోకలు కూడా నిలిపివేయాలని అధికారులకు సూచించింది. సరిగ్గా ఉదయం 11 గంటలకు మౌనం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
స్వాతంత్య్రం కోసం బలిదానం చేసిన వారి త్యాగాలను స్మరించుకుంటూ మౌనం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -