SSSMB 29:మహేష్ మూవీలో మరో హీరోయిన్‌!

11
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్‌లో ఇది SSMB 29 అంటే 29వ సినిమా. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాను తీసుకోగా తాజాగా సెకండ్ హీరోయిన్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

సెకండ్ హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్ ను తీసుకునే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది. ఆమె పాత్ర కథకు అనుగుణంగా సెకండ్ హాఫ్ లో వస్తోందని టాక్ నడుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుండగా ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.

Also Read:హరిహర వీరమల్లు..లిరికల్ అప్‌డేట్!

- Advertisement -