SSMB29 మొదటి సింగిల్ సంచారిని విడుదల చేయగా ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదివరకే మేకర్స్ నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా ట్రైలర్ గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జియో హాట్‌స్టార్ ఇప్పుడు ఒక పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. ట్రైలర్‌ను నవంబర్ 15న జరిగే గ్రాండ్ ఈవెంట్‌లోనే విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ధృవీకరించింది.
జియో హాట్‌స్టార్ తాజా సోషల్ మీడియా పోస్ట్ చూసి మహేష్ బాబు, రాజమౌళి అభిమానులు సంబరపడిపోయారు. ఎందుకంటే, ట్రైలర్ ఇంత త్వరగా వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇది సినిమా విడుదల కూడా ముందుగానే జరగవచ్చని సూచిస్తోంది.ఈ భారీ యాక్షన్–అడ్వెంచర్ సినిమాలో ప్రియాంక చోప్రా మరియు పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

