- Advertisement -
సూపర్‌స్టార్ మహేష్ బాబు మరియు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ SSMB29పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మోస్ట్ అవెయిటెడ్ చిత్రానికి సంబంధించిన టైటిల్ లాంచ్ నవంబర్ 15, 2025న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ ఈవెంట్ కోసం సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి.ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, టీమ్ ఇటీవల ఒక సర్‌ప్రైజ్ సాంగ్‌ను విడుదల చేసింది.
ఈ పాటను శ్రుతి హాసన్ ఆలపించగా, సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించారు. పాట ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం, శ్రుతి హాసన్ ఈ పాటను ఈవెంట్‌లో లైవ్‌గా పర్ఫార్మ్ చేయబోతున్నట్లు తెలిసింది.
Also Read:నిర్మాత బెల్లంకొండపై కేసు నమోదు
- Advertisement -

