మహేష్ బాబు – రాజమౌళి దర్శకత్వంలో SSMB29 వర్కింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను కూడా పూర్తి చేసుకుంది.
అయితే తాజాగా హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాని… రాజమౌళి, మహేశ్ బాబు సినిమా ఇంకో ఏడాదిలో రాబోతోందని, సినిమాను ప్రపంచమంతా చూసి తీరాల్సిందేనని హీరో నాని అన్నారు. ఏదిఏమైనా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మహేష్ సరసన హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోండగా రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.
Also Read:వరంగల్ సభను అడుగడుగునా అడ్డుకున్నారు!

