SSMB29..అదిరే అప్‌డేట్

5
- Advertisement -

మహేష్ బాబు మరియు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తొలిసారి కలిసి చేస్తున్న భారీ ప్రాజెక్ట్ SSMB29. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా పృథ్విరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా SSMB29 టైటిల్ రివీల్ ఈవెంట్ గురించిన అప్‌డేట్ వచ్చేసింది. ఈ కార్యక్రమాన్ని 2025 నవంబర్ 15న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీ (రామోజీ ఫిల్మ్ సిటీ)లో నిర్వహించేందుకు టీం సిద్ధమవుతోంది.

ఇక తాజాగా ప్రియాంక చోప్రా హైదరాబాద్ చేరుకున్నట్లు ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమె టైటిల్ ఈవెంట్ ప్రిపరేషన్స్ కోసం వచ్చిందా, లేక షూట్‌కి జాయిన్ అవ్వడానికి వచ్చిందా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ చిత్రాన్ని శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.

Also Read:తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ

- Advertisement -