దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్‌లో ఇది SSMB 29 అంటే 29వ సినిమా. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాను తీసుకోగా తాజాగా సెకండ్ హీరోయిన్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సెకండ్ హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్ ను తీసుకునే ఆలోచన ఉండగా తాజాగా మరో హీరోకు సంబంధించిన వార్త బయటకు వచ్చింది.
ఓ కీలక పాత్ర కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరోని తీసుకునే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది. ఆ హీరో పాత్ర కథకు అనుగుణంగా సెకండ్ హాఫ్ లో వస్తోందని టాక్ నడుస్తోంది.
దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం… అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను అంటూ విజయేంద్రప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.
Also Read:రాజకీయాల కోసం నీటి హక్కులను కాలరాయొద్దు

