- Advertisement -
సింహాన్ని లాక్ చేశా…ఇది సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ పోస్ట్ లో సింహాన్ని లాక్ చేసిన జక్కన్న.. ఓ పాస్ పోర్ట్ కూడా చుపించారు. దీని అర్ధం పాస్ పోర్ట్ లాక్కొని సింహాన్ని లాక్ చేశా అని.
దీంతో ఎస్‌ఎస్‌ఎంబీ 29 సినిమా మొదలైనట్లేనని హింట్ ఇచ్చారు. దీనికి మహేష్ బాబు అదిరిపోయే రిప్లే ఇచ్చారు. పోకిరి సినిమాలోని డైలాగ్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని కామెంట్ చేశారు. నటి ప్రియాంకా చోప్రా కూడా ఫైనల్లీ అని రిప్లే ఇచ్చారు.
అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ కథలో విదేశీ నటులు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రానికి ‘గరుడ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.
Also Read:లంచాల తెలంగాణ..సీఎంపై రాజాసింగ్ ఫైర్
- Advertisement -