తెలంగాణలో ఇంటర్ ఫలితాల తర్వాతే పదో తరగతి పరీక్షలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈనెల 21 లేదా 25వ తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉండగా పదో తరగతి పరీక్ష ఫలితాలను ఎప్పుడు రిలీజ్ చేస్తారా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 2,650 కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించగా.. దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు అధికారులు తెలిపారు. 15వ తేదీ వరకు మూల్యాంకనం ప్రక్రియ జరుగనుండగా ఈ నెల 25వ తేది తర్వాత ఫలితాలను రిలీజ్ చేసేందుకు విద్యాశౄఖ కసరత్తు చేస్తోంది.
Also Read:శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా
పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలను ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా లేదా https://www.manabadi.co.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.