తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపింది. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 14వ తేదీన పరీక్షలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.
పరీక్షల షెడ్యూల్ ఇదే…
మార్చి 14న మొదటి భాషా పరీక్ష,
మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష
మార్చి 23 థర్డ్ లాంగ్వేజ్
మార్చి 28 మ్యాథమాటిక్స్
ఏప్రిల్ 2 సైన్సు పార్ట్-1 ఫిజిక్స్
ఏప్రిల్ 7 బయలాజికల్ సైన్స్
ఏప్రిల్ 13 సోషల్ స్టడీస్
ఏప్రిల్ 15 ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పరీక్ష
ఏప్రిల్ 16 ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్ష
సైన్స్ పరీక్ష రెండు భాగాలుగా : పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు. సైన్స్ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్, బయాలజీ) సంబంధించి పరీక్ష విధానంలో ప్రకటనలో స్పష్టత ఇచ్చారు. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు రెండు భాగాలుగా వేర్వేరు రోజుల్లో వారం రోజుల వ్యవధితో జరగనున్నాయి. ముఖ్యంగా బయాలజీ, సోషల్ స్టడీస్ పరీక్షలకు మధ్య ఎక్కువగా 5 రోజుల గ్యాప్ ఉంది. పరీక్షలకు ఇంకా సరిగ్గా 3 నెలల సమయం ఉంది.

