బాహుబలి 2 రిలీజ్ కు టైం దగ్గరపడుతోంది. దీంతో ఈ సినిమా కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో రాజమౌళి నెక్ట్స్ మూవీపైనా చర్చమొదలైంది. తాజా సమాచారం ప్రకారం..రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయం పై అప్పుడే దృష్టి పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది.
ఈ సారి ఓ భారీ ప్రాజెక్ట్ ని చేస్తాడంటూ జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. ఇండియన్ సినిమా స్టార్ హీరోలు రజని కాంత్, అమీర్ ఖాన్ మోహన్ లాల్ లతో రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తాడట. పైగా ఈ సినిమాకు ఏకంగా 400 కోట్ల భారీ బడ్జెట్ అవుతుందని, హిందీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తాడు. ఎప్పటికైనా తాను మహాభారతం సినిమా తీస్తానని, ఆ సినిమాలో తారక్ కృష్ణుడు లేదా ధుర్యోదనుడి పాత్రలు పోషిస్తాడని జక్కన్న ఇదివరకే చెప్పాడు.
అయితే ఈ సినిమాను ఒకేసారి కాకుండా పార్టు పార్టులుగా తియ్యాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఇందుకు కనీసం ఆరు సంవత్సరాల పట్టే అవకాశం ఉంది. హాలీవుడ్ టీవీ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎపిసోడ్ల మాదిరిగా ఈ సినిమాని చిత్రీకరించే యోచనలో రాజమౌళి ఉన్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. అయితే ఇప్పట్లో మాత్రం తాను మహాభారతం తియ్యడంలేదని, ఈ సినిమా చెయ్యడానికి మరో పది సంవత్సరాలు పట్టొచ్చని రాజమౌళి ఇదివరకే చెప్పాడు. మరీ, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే.. ఆఫ్టర్ బాహుబలి రిలీజ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే.
ఆ ముగ్గురు స్టార్లతో మహాభారతం…!
- Advertisement -
- Advertisement -