అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ అదిరింది‌..

285
rrr
- Advertisement -

టాలీవుడ్ టాప్‌ డైరెక్టర్‌ ఎస్‌ ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’గా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’గా కనిపించనున్నాడు. (మార్చ్ 27) చరణ్ బర్త్ డే కావడంతో ఒకరోజు ముందుగానే ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ రెడీ చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే తాజాగా ‘అల్లూరి సీతారామరాజు’గా రామ్ చరణ్ ని లుక్ ను విడుదల చేసింది.

ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియాలో పంచుకున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్కును అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. బ్యాక్ గ్రౌండ్‌లో మన్యం భగభగమండుతుండగా, అంబరానికి విల్లు గురిపెట్టిన రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను ఆవాహన చేసుకున్న తీరు ఆ ఫొటో ద్వారా స్పష్టమైంది. దీనిపై రాజమౌళి స్పందించారు. ‘ధైర్యం, ఆత్మగౌరవం, పరిపూర్ణత కలిగిన వ్యక్తి… ఇడుగో.. ఇతడే నా అల్లూరి సీతారామరాజు ‘అంటూ వ్యాఖ్యానించారు. కాగా, సోషల్ మీడియాలో ఈ అప్ డేట్ ను పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే వేల సంఖ్యలో రీట్వీట్లు, లైకులతో అభిమానులు హోరెత్తిస్తున్నారు.

- Advertisement -