బాహుబలి2 షూటింగ్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఆ తరువాత గ్రాఫిక్ వర్క్ పూర్తిచేసి, వచ్చే ఏడాది ఏప్రిల్ 28న మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరీ, ఈ చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి నెక్స్ట్ ఏ ప్రాజెక్టు చేయబోతున్నాడు. భారీ చిత్రాల మీద దృష్టిపెట్టిన రాజమౌళి ఇక తెలుగు హీరోలను పెట్టి, సోలో సినిమాలు చెయ్యకపోవచ్చే టాక్ వినిపిస్తోంది. తీస్తే.. మల్టీస్టారర్ చిత్రాలనే తీసే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో జక్కన్న అమీర్ ఖాన్ తో సినిమా చెయ్యాలని భావిస్తున్నట్టు సమాచారం.
అమీర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. రాజమౌళి తరువాతి సినిమా ఆయనతోనే ఉంటుందని టాక్. ఒకవేళ ఆయన రాజమౌళితో సినిమాకు ఇంకా టైమ్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం.. ఈగ2 మొదలు పెట్టే అవకాశం ఉందట. ఈగ చిత్రం ఎడింగ్ లో ఐయామ్ బ్యాక్ అంటూ ఈగ2 ఉంటుందని రాజమౌళి చెప్పకనే చెప్పాడు. పైగా ఓ పెద్ద సినిమా చేశాక తరువాత చిన్న చిత్రం చేయడం రాజమౌళి అలవాటైన విషయం. అందుకనే ఆయన ఈగ2 చేసే అవకాశం ఉంది. ఒకవేశ ఈ మూవీ చేస్తే.. జాతీయస్థాయిలో భారీగానే తీయ్యాలని జక్కన్న భావిస్తున్నట్లు సమాచారం.
ఇది కాకుండా మహేష్‌తో ఓ సినిమా చేయాలని రాజమౌళి ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిపై ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే భవిష్యత్ లో ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఒక్క మహేష్‌తో మాత్రమే ఓ సినిమా ఏ సమయంలోనైనా చేస్తాడట రాజమౌళి. మరీ రాజమౌళి చేయబోయే ఆ క్రేజీ ప్రాజెక్టు ఏంటో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.