సక్సెస్ డైరెక్టర్‌గా పేరొందిన రాజమౌళి.. బాహుబలి చిత్రాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. బాహుబలి దర్శకుడిగా ఆయన ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. ఈ మూవీని ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. ఇప్పుడు పాకిస్థాన్‌లోని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ బాహుబలిని ప్రదర్శించారు. దీంతో ఈ వేడుకలో పాల్గొనేందుకు మా దేశం రమ్మంటూ దాయాది దేశం జక్కన్నకు ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే.
అయితే ఎక్కడికి వెళ్లినా కూడా అంతగా సంతోషపడని జక్కన్న పాకిస్థాన్ పిలవగానే చాలా ఎగ్జైట్ అయిపోయాడు. ఇన్విటేషన్ వచ్చిన సెకండ్స్ లోనే సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్ పిలిచింది అంటూ.. ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కరాచీ’ వారికి ధన్యవాదాలు అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇక తాజాగా.. అక్కడికి వెళ్లిన తరువాత ఎంతో మంది ప్రముఖు నటీనటులను కలిసిన రాజమౌళి ఎవరు ఉహించని విదంగా మాట్లాడాడు.
కొందరు పాకిస్థాన్ మీద మీ అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పాకిస్థాన్ అంటే చిన్నప్పటి నుంచి మాకు ఎనిమీ. శత్రువులుగా చూసేవాళ్ళం. బిగ్గెస్ట్ శత్రువు వసిమ్ అక్రమ్. కానీ పెద్దయ్యాక ఎంతో మార్పు వచ్చింది. అందరం ఒకే రకమైన మనుషులమని రాజమౌళి మాట్లాడిన తీరుకు అందరు చప్పట్లు కొట్టారు. ఇక వేడుకల అనంతరం రాజమౌళిని ఎంతో మంది పాకిస్థాన్ నటీ నటులు కలిశారు. ఆయనతో కలిసి ఫొటో దిగేందుకు పోటీ పడ్డారు. జక్కన్న కూడా ఎక్కడా తడబడకుండా పాకిస్థాన్ అభిమానులతో చాలా ఆప్యాయంగా పలకరించుకుంటూ వెళ్లారు.