కార్తికేయ పెళ్లి వీడియో..మీరూ చూడండీ

276
SS Karthikeya wedding
- Advertisement -

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజల వివాహం డిసెంబరు 30న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జయపురలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో ఈ శుభకార్యం జరిగింది. టాలీవుడ్‌ సినీ ప్రముఖులు పెళ్లికి హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన వీరి వివాహానికి ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌, రానా, నాని , నాగార్జున, రాఘ‌వేంద్ర‌రావు, అఖిల్‌తో పాటు త‌దిత‌ర ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు.

SS Karthikeya wedding video

బాలీవుడ్ భామ సుస్మితా సేన్ తాను ద‌త్త‌త తీసుకున్న పిల్ల‌ల‌ని వెంట పెట్టుకొని వివాహానికి హాజ‌రైంది. పెళ్లిలో సెల‌బ్రిటీలు అంద‌రు ఫుల్ హంగామా చేశారు. సుస్మితా సేన్ మాత్రం ఘ‌నంగా జ‌రిగిన పెళ్లికి సంబంధించిన వీడియో తీసి ఆ వీడియోని తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. త‌లంబ్రాల‌లోని ఒక్కో గింజ మీకు దీవెన‌లు, ప్రేమ‌, సంతోషం, ఆశీర్వాదం అందివ్వాల‌ని మీరు ఎప్పుడు సుఖ సంతోషాల‌తో హ్యాపీగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని కామెంట్ పెట్టింది సుస్మితా.

SS Karthikeya wedding

పూజ, కార్తికేయలకు శుభాకాంక్షలు తెలిపిన స్మితా పెళ్లి ఎంత అందంగా జరిగిందో.. ఐ లవ్‌ యు గాయ్స్‌’ అని ఆమె ట్వీట్‌ చేశారు. రానా కూడా కార్తికేయ, పూజకు తాజాగా శుభాకాంక్షలు చెప్పారు. ‘2018లో నాకు ఇష్టమైన ఫొటో ఇది’ అంటూ కార్తికేయ, పూజ జీలకర్ర, బెల్లం పెట్టుకుంటున్న ఫొటోను రానా షేర్‌ చేశారు. దీన్ని ఉపాసన కొణిదెల తీశారని కూడా చెప్పారు.

 

- Advertisement -