TTD: ఉత్తరాది భక్తుల కోసం శ్రీవారి ఆలయం

1
- Advertisement -

ఉత్తరాది భక్తుల కోసం ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా సందర్భంగా శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేసినట్లు టీటీడీ చైర్మన్  బి.ఆర్.నాయుడు తెలియజేశారు. ప్రయాగ్ రాజ్ లోని శ్రీవారి నమూనా ఆలయాన్ని టీటీడీ చైర్మన్  బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆయనకు హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో గుణ భూషణ్ రెడ్డి, స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన ఆలయ ప్రాంగణంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చతుర్వేద హవనంలో పాల్గొని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేది సంక్రాంతి నుండి శివరాత్రి వరకు 45 రోజుల పాటు జరుగుతున్న ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభ మేళాలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. 250 మంది టీటీడీ సిబ్బంది డిప్యూటేషన్ పై శ్రీవారి నమూనా ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తరాదిలో ధర్మ ప్రచారం కోసం చక్కటి ఏర్పాట్లు చేసిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులకు అభినందనలు తెలిపారు. ఉత్తరాది భక్తులందరూ శ్రీవారిని నమూనా ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అయోధ్య శ్రీరాముడికి టీటీడీ తరఫున తొలిసారిగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని, ఈ సందర్భంగా సరయూ నదీ తీరంలో స్వామివారికి వైభవంగా నిర్వహించిన స్నపన తిరుమంజనం కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని తెలియజేశారు.

Also Read:ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన తప్పనిసరి: పొన్నం

- Advertisement -