నిండుతున్న శ్రీశైలం డ్యామ్…

433
srisailam project
- Advertisement -

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో ఈ రోజు క్రస్ట్ గేట్ల ద్వారా నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర మంత్రులు శాసన సభ్యులతో నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు సన్నాహాలు చేశారు.

కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారి వర్షాల వల్ల శ్రీశైలం రిజర్వాయర్ కు వరద తాకిడి గణనీయంగా పెరిగింది. రెండు రోజుల్లో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకొని జలకలను సంతరించుకుంది. జూన్ 28 నాటికి 811 అడుగులు మాత్రమె ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 88౦.2౦ అడుగులు నిండుకుంది. పూర్తీ స్థాయి నీటి సామర్ధ్యం 215 టిఎంసి లు కాగా ప్రస్తుతం 190 టిఎంసి లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఉదృతంగా ప్రవహిస్తూ అల్ల్మెట్టి, నారాయణ పూర్ ప్రాజెక్టులు దాటుకుని జూరాల నుండి శ్రీశైలానికి ఇప్పటివరకు 248 టిఎంసిలు, సుంకేశుల నుండి 15.37 టిఎంసిలు, హుంద్రి నుండి 12 టిఎంసిలు, పోతిరెడ్డిపాడు 13 టిఎంసిలు, ఎంజికేఎల్ నుండి 3 టిఎంసిలు, ముచ్చుమర్రి నుండి 3 టిఎంసిలు ఇన్ ఫ్లో తో మొత్తం 285 టిఎంసిల నీరు రిజర్వాయర్ కు వచ్చి చేరుకోగా జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 113 టిఎంసిల నీటిని అవుట్ ఫ్లో ద్వారా సాగర్ రిజర్వాయర్ కు విడుదలచేశారు.

ఎడమగట్టు హైడల్ పవర్ భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లో జూలై 19 వ తారీకు నుండి జనరేషన్ మొదలు పెట్టి ఇప్పటి వరకు 112 టిఎంసిల నీటిని వినియోగించగా, కుడిగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఇప్పటివరకు పూర్తీ స్థాయి విద్యుతుత్పత్తి మొదలు కాకపోవడం వల్ల అత్యవసర పరిస్తితుల్లో ఉత్పత్తిని చేసినందుకు 1.2 టిఎంసిల నీటిని వినియోగించుకొని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు చెప్తున్నారు.ప్రస్తుతం నిండు కుండలా తలపించే శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు తెరుచుకుంటున్న విషయం తెలుసుకున్న పర్యాటకులు అధిక సంఖ్యలో డ్యాం వద్దకు చేరుకుంటున్న క్రమంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేస్తున్నట్లు సరిహద్దు పోలీస్ అధికారి శ్రీశైలం ఇనిస్పెక్టర్ రవీంద్ర ఎస్సై లు పీరయ్య యాదవ్, హరి ప్రసాద్ లు తెలిపారు. ముఖ్యంగా కరోనా నివారణ చర్యల్లో భాగంగా స్వియ్య రక్షణ ప్రతి ఒక్కరి భాద్యతగా వ్యవహరించాలని సూచించారు.
డ్యాం అధికారులు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారి చేస్తూ అందరిని అప్రమత్తం చేస్తున్నారు. పర్యాటకులు గుంపులు గుంపులు గా ఉండి వాహనాలను రోడ్లపై నిలిపిన వారిపట్ల ఖాటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -