మల్లన్న హుండి ఆదాయం రూ.1,81,91,821

122
srisailam

శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఆలయ సిబ్బందితో లెక్కింపు జరిగింది.గత 20 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు కానుకలునగదు రూపంలో (1,81,91,821)
కోటి,ఏనభై ఒక్కలక్ష,తొంభై ఒక్కవేయ్యి,ఏనిమిది వందల,ఇరవై ఒక్క రూపాయలు ఆదాయంగా వచ్చినట్లు ఈఓ కెఎస్ రామారావు తెలిపారు.

వీటితోపాటు 270 గ్రాముల బంగారం,1 కేజీ 980 గ్రాముల వెండి,మరియు 2 సింగపూర్ డాలర్లు, 50 ఇంగ్లాండ్ పౌండ్స్, 10 కెనడా డాలర్లు, 29 యుఎస్ఏ డాలర్లు, 1 ఎస్ఎయు రియాల్స్ మొదలైన విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ ఈఓ కెఎస్ రామారావు తెలిపారు.